తరలివచ్చిన జనం.. అదిరింది నిమజ్జనం

తరలివచ్చిన జనం.. అదిరింది నిమజ్జనం

గణపతి బప్పా మోరియా నినాదాలు, కేరింతలతో నగరం మార్మోగింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రతి బస్తీ, కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో గణనాథుల విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. బ్యాండ్​ మేళాలు, డీజేలు, తీన్మార్​స్టెప్పులు, కోలాటాలతో యువత, పిల్లలు ఉత్సాహంగా  పాల్గొన్నారు. చాలామంది వినూత్నంగా అలంకరించిన గణనాథులకు లైటింగ్ ఏర్పాటు చేసి తీసుకువచ్చారు. దీంతో చార్మినార్, బేగంబజార్, ఎంజే మార్కెట్, బషీర్​బాగ్, లిబర్టీ ప్రాంతాలు కళకళలాడాయి. ఎంజే మార్కెట్ వద్ద మహిళలపై లైంగికదాడులకు నిరసనగా కొవ్వొత్తులతో ర్యాలీ తీయడం ఆకట్టుకుంది. స్టాప్ వయలెన్స్ ఎగైనెస్ట్ విమెన్​ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఫుడ్​, వాటర్​ప్యాకెట్స్​ పంపిణీ చేశాయి. సాయంత్రం మొదలు తెల్లవారే వరకు పాతబస్తీ నుంచి టాంక్​బండ్​ వరకు వినాయకులు బారులు తీరారు. సికింద్రాబాద్ ​నుంచి అర్ధరాత్రి వరకూ గణనాథుల ఊరేగింపులు కొనసాగాయి. – హైదరాబాద్ సిటీ,వెలుగు