జనగామలో త్వరలో అందుబాటులోకి సిటీ స్కాన్​ సేవలు

జనగామలో త్వరలో అందుబాటులోకి సిటీ స్కాన్​ సేవలు

జనగామ/ జనగామ అర్బన్, వెలుగు : జనగామ గవర్నమెంట్ ​జిల్లా హాస్పిటల్​లో ఎట్టకేలకు సిటీ స్కాన్​సేవలు ప్రారంభంకానున్నాయి. సుమారు రూ.2 కోట్లతో అధునాతన యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటు సిటీ స్కాన్​మెషినరీ ఇన్​స్టాలేషన్​ ప్రతినిధులు, మెడికల్​కాలేజీ ప్రిన్సిపల్​గోపాల్​రావు, రేడియాలజీ హెచ్​వోడీ డాక్టర్​ శ్రీహరి శుక్రవారం సాయంత్రం కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​ను ఆయన చాంబర్​లో కలిశారు. మెషినరీ ఏర్పాట్లపై వివరించారు. ఇన్​స్టాలేషన్​ ప్రక్రియకు 90 రోజులు పడుతుందని చెప్పారు. స్పందించిన కలెక్టర్​సాధ్యమైనంత త్వరగా స్కానింగ్​సేవలు అందుబాటులోకి తేవాలని సూచించారు.

కార్యక్రమంలో మెడికల్​ కాలేజీ సూపరింటెండెంట్​ఫహీమ్, టీ హబ్​టెక్నీషియన్​మోర్తాల దీపక్​తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్​డీసీపీ రాజమహేంద్ర నాయక్​తో కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్​ అన్నారు.