సూర్యాపేట, వెలుగు: గత నెలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డాక్టర్ ఏఎస్ రావ్ అవార్డ్స్ కౌన్సిల్ పోటీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు అత్యత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారు. 10వ తరగతిలో 7 గురు విద్యార్థులు మొదటి లెవెల్‌లో సత్తాచాటి రెండవ లెవెల్‌కు అర్హత సాధించారు. అదే విధంగా 9 వ తరగతిలో 6 గురు విద్యార్థులు రెండో లెవెల్‌కు అర్హత సాదించారు.
10వ తరగతిలో కె.హరిణి, ఆర్. సాత్విక్ సాయి, ఆర్. రోహన్ రెడ్డి, ఎం. అనుదీప్ రెడ్డి, వై, సాయి కార్తీక్, ఏ. సాయి ప్రణీత్, ఏ. ఆకాశ్ రెండవ లెవెల్ అర్హత సాధించారు. 9 వ తరగతిలో జి. శ్రీజ, సాయి సృజన, ప్రజ్ఞా రెడ్డి, ఎస్. సాయి గోకుల్, నంద కిషోర్, ప్రణవి రెండో లెవల్‌కు అర్హత సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ ప్రకాశ్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.