
హైదరాబాద్, వెలుగు: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు బ్యాంకింగ్ పార్ట్నర్గా వ్యవహరించడానికి ప్రైవేట్ రంగ బ్యాంకు సిటీ యూనియన్ బ్యాంక్ (సీయూబీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఎస్ఆర్హెచ్ అభిమానులకు, ఆటగాళ్లకు, సిబ్బందికి సిటీ యూనియన్ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లను, సేవలను అందిస్తుంది. వీటిలో కస్టమైజ్డ్ సేవింగ్స్ అకౌంట్లు, లోన్లు, కో–-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో సహా అనేక ప్రత్యేక బ్యాంకింగ్ ప్రొడక్టులు ఉంటాయి.
జెర్సీలు, టోపీల వంటి వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఎన్ఆర్ఐ అకౌంట్ సేవలను పొందవచ్చు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రోజుల్లో సీయూబీ బ్రాండ్‌ను ప్రదర్శిస్తారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ డాక్టర్ ఎన్ కామకోడి మాట్లాడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ప్రత్యేక బ్యాంకింగ్ భాగస్వామిగా భాగస్వామ్యం ఖరారు కావడం చాలా ఆనందంగా ఉందని, ఆర్థిక సేవలతోపాటు ఎన్నో సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.