- భయం వద్దు.. ప్రతి ఒక్కరినీ ఇండియాకు తీసుకొస్తాం
- పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. యుద్ధం ఎఫెక్ట్‌తో ఎయిర్ స్పేస్‌ను మూసేస్తూ ఉక్రెయిన్ నిర్ణయం తీసుకోవడంతో మన స్టూడెంట్స్‌ను ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీసుకొచ్చి.. పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా స్వదేశానికి తీసుకొస్తోంది. అయితే ఆయా దేశాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీసాలతో పాటు, పేపర్ వర్క్‌ను సులభతరం చేయడంతో పాటు తరలింపు ఆపరేషన్‌ను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ప్రధాని మోడీ నలుగురు కేంద్ర మంత్రులను రొమేనియా, స్లొవేకియా, హంగేరి, పోలండ్ దేశాలకు పంపారు. దీంతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్న భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అక్కడ మన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరినీ ఇండియాకు చేరుస్తామని భరోసా ఇచ్చారు.
#WATCH | Civil Aviation Minister Jyotiraditya Scindia interacts with Indian students at Henri Coandă International Airport in Bucharest (Romania). The students are being evacuated and being brought back to India. #OperationGanga pic.twitter.com/KStF51un0I
— ANI (@ANI) March 2, 2022
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి బుకారెస్ట్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విద్యార్థులను స్పెషల్ ఫ్లైట్స్‌లో ఇండియాకు పంపే ముందు వారితో సింధియా కొద్దిసేపు మాట్లాడారు. ‘‘ఇక నేను ఇక్కడే ఉంటాను. మీరు భయపడాల్సిన పనిలేదు. అంతా సేఫ్‌గా ఇండియాకు చేరుకుంటారు. ఇంకా ఉక్రెయిన్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పండి.. వాళ్లను కూడా సేఫ్‌గా తీసుకొస్తాం” అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.