డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి 2021 ప్రారంభం నాటికి విమానాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఆయన హాజరైన బి-స్కూల్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ‘లాక్‌డౌన్ కారణంగా విమానాయాన రంగం దాదాపు రెండు నెలలకు పైగా మూతపడింది. అయితే కేంద్రం ఇచ్చిన కొన్ని సడలింపుల ద్వారా మే 25న తిరిగి తన సేవలను ప్రారంభించింది. అప్పటినుంచి రోజుకు 30 వేల మంది ప్రయాణికులను చేరవేసింది. అయితే దీపావళి సందర్భంగా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య 2.25 లక్షల మందికి చేరుకుంది. ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ 70 శాతం ప్రయాణికులతో నడుస్తోంది. త్వరలోనే 80 శాతం మంది ప్రయాణికులను చేరుకుంటాం. డిసెంబర్ 31, 2020 లేదా జనవరి మొదటి వారం నాటికి విమానయాన పరిశ్రమ తన సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది’ అని ఆయన తెలిపారు.
దేశంలో పౌర విమానయానం పూర్తిగా అందుబాటులోకి వస్తే.. భద్రతా నియమాలను తప్పనిసరిగా పటిష్టం చేస్తామని మంత్రి పూరి తెలిపారు.
ప్రస్తుతం యూకే, జపాన్ మరియు ఉత్తర అమెరికా నుంచి విమానాలు ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం భారతదేశానికి నడుస్తూనే ఉన్నాయి. కాగా.. భారత్ నుంచి ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాకు ఎటువంటి విమానాలు వెళ్లడం లేదు.
For More News..