సింగరేణి ల్యాండ్​ కబ్జాకు సివిల్​ కాంట్రాక్టర్​ స్కెచ్

సింగరేణి ల్యాండ్​ కబ్జాకు సివిల్​ కాంట్రాక్టర్​ స్కెచ్
  •     అడ్డుకుంటున్న ఎస్టేట్, సెక్యూరిటీ సిబ్బంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్​కంపెనీ హెడ్డాఫీస్​ఉన్న కొత్తగూడెంలో సింగరేణి ల్యాండ్స్​ దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. హెడ్డాఫీస్​కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తగూడెం పట్టణం హనుమాన్​బస్తీలో దాదాపు రూ. కోటికి పైగా విలువైన సింగరేణి సూపర్​ బజార్​ ల్యాండ్​ను కంపెనీలోనే సివిల్​కాంట్రాక్టర్​గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కబ్జాకు స్కెచ్​ వేశాడు. అందులో నిర్మాణం చేపట్టేందుకు రెండు రోజులుగా ఆ వ్యక్తి చెట్ల పొదలను తొలగిస్తున్నాడు.

స్థానికులు అడ్డుకున్నారు.. కానీ తన వద్ద అన్ని ఆధారాలున్నాయని అతడు చెప్పాడు. దీంతో స్థానికుల సింగరేణి అధికారులకు సమాచారం ఇవ్వడంతో  మంగళవారం ఎస్టేట్, సెక్యూరిటీ విభాగం అధికారులు ఆ స్థలంలో నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఈ ల్యాండ్​ సింగరేణి సూపర్​బజార్​దేనంటూ ఎస్టేట్​ అధికారులు పేర్కొన్నారు. సింగరేణి స్థలాలను కబ్జా చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.