పేద ఖైదీలకు న్యాయ సహాయం : జడ్జి డి.బి. శీతల్

పేద ఖైదీలకు న్యాయ సహాయం : జడ్జి డి.బి. శీతల్

వికారాబాద్, వెలుగు: లాయర్​ను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని పేద ఖైదీలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి.బి శీతల్ సూచించారు. పరిగి సబ్​ జైలును సోమవారం ఆమె సందర్శించారు. జైల్లో ఖైదీల రోజువారీ దినచర్య,  వసతుల గురించి జైలు సూపరింటెండెంట్​రాజ్ కుమార్​ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఖైదీలను ఉద్దేశించి ఆమె  మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పులతో తమతోపాటు తమ కుటుంబసభ్యులు క్షోభ పడుతున్నారన్నారు.

 విడుదలైన తర్వాత రెండోసారి  జైలుకు రాకుండా సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పేద ఖైదీలకు న్యాయ సేవా సంస్థ ద్వారా డిఫెన్స్ లాయర్​ను పెట్టి, బెయిల్ మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో లీగల్ డిఫెన్స్ లాయర్లు రాము, వెంకటేష్, శ్రీనివాస్, గౌస్ పాషా, జైలు సిబ్బంది విశ్వనాథరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.