చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్: పౌరహక్కుల సంఘం

చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్: పౌరహక్కుల సంఘం

ములుగు: చెల్పాక ఎన్ కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం స్పందించింది. చెల్పాకలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత ఎన్కౌంటర్ చేశారని ఆరోపించింది. తలపై కాల్చిన గాయాలు తప్పితే ఎక్కడా గాయాలు లేవని, నిపుణులైన వైద్య బృందంతో పోస్టు మార్టం నిర్వహించాలని డిమాండ్ చేసింది.

రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన12 నెలల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారని తెలంగాణ పౌరహక్కుల సంఘం చెప్పింది. ఎన్ కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.

ALSO READ | హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  నర్సంపేట ఏరియా కమాండర్ భద్రుతో సహా  ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.  ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్ తో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతులు

  • కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న
  • గోలపు మల్లయ్య అలియాస్ మధు
  • ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్
  • ముస్సాకి జమున 
  • జైసింగ్, పార్టీ సభ్యుడు
  • కిషోర్, పార్టీ సభ్యుడు
  • కామేష్, పార్టీ సభ్యుడు