రా.. ఇద్దరం సివిల్స్ ఇప్పుడు రాద్దం : స్మితా సబర్వాల్‌కు బాలలత సవాల్

రా.. ఇద్దరం సివిల్స్ ఇప్పుడు రాద్దం : స్మితా సబర్వాల్‌కు బాలలత సవాల్

దివ్యాంగుల రిజర్వేషన్ పై  IAS అధికారి స్మితా సభర్వాల్ చేసిన ట్విట్ పై సివిల్స్ మెంటర్ బాలలత ఫైర్ అయ్యారు. దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మిత సభర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు ఆమె.  సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా రిజర్వేషన్ గురించి ఆదివారం స్మితా సబర్వాల్ X లో పోస్ట్ చేశారు. అంగవైక్యం ఉన్నవారికి సివల్స్ ఉద్యోగాల్లో ఇంచే రిజర్వేషన్ గురించి ఆలోచించాలని ఆమె అన్నారు.

అధికారిగా ఉండి ఫీల్డ్ లో తిరగాల్సి ఉంటుందని స్మితా సబర్వాల్ అన్నారు. దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బాలలత మీడియా సమావేశంలో స్పందించారు. ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తావని స్మిత సభర్వాల్ కు సవాల్ విసిరారు. అసలు ఫీల్డ్ లో పరిగెత్తుతూ స్మిత సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందని ఆమె ప్రశ్నించారు.

జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా స్మితా సబర్వాల్ మాట్లాడరని అన్నారు. వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత సభర్వాల్ మాటలు మరింత కుంగదీసాయని బాలలత చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి అపాయింట్ మెంట్ వికలాంగురాలికే ఇచ్చారని గుర్తు చేశారు. స్మితా తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతుందా.. ప్రభుత్వం తరపున మాట్లాడుతుందా అని వివరణ ఇవ్వాలని కోరింది. కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మిత సభర్వాల్ పైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.

అంగవైకల్యం ఉన్న జై పాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీ సాధించారు. స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారని విజయాలను సాధించిన దివ్యాంగులను గుర్తుచేశారు. చాలామంది దివ్యాంగులు పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నారని అన్నారు. 24 గంటల్లో స్మిత సభర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని బాలలత డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం ఈ అంశం పైన యాక్షన్ తీసుకోకపోతే టాంక్ బండ్ పైన నిరసన దీక్ష చేపడుతామని ఆమె తెలిపారు.