
రామడుగు, వెలుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన సివిల్స్ ర్యాంకర్ నందాల సాయికిరణ్(27వ ర్యాంకర్), అతడి తల్లి లక్ష్మి సీఎం రేవంత్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం సాయికిరణ్‌ను శాలువాతో సత్కరించారు. సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వెలిచాల మాజీ సర్పంచ్ వీర్ల నర్సింగరావు పాల్గొన్నారు.