జగిత్యాల జిల్లాలోని పలు రైస్ మిల్లర్లపై సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. డిసెంబర్ 19వ తేదీ రాత్రి నుంచి కోరుట్లకు చెందిన కొత్త సురేష్ అనే వ్యాపారికి చెందిన సిరికొండ, కోరుట్లలోని మూడు రైసు మిల్లులపై సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కోట్ల రూపాయల ధాన్యం స్టాక్ లో అధికారులు తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
దాదాపు 1000 ట్రక్కుల ధాన్యం తేడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రైస్ మిల్లు్ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థికపరిస్థితిని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు నిర్వహిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ శాఖ రూ.50వేల కోట్ల అప్పుల్లో కూరకపోయినట్లు చెప్పారు.