
హైదరాబాద్, వెలుగు:ధాన్యం కొనుగోలు వ్యవహారమంతా ఆన్ లైన్ లోజరిగేలా, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సోమవారం ప్రకటించారు. ఓపీఎంఎస్(ఆన్ లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్) యాప్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ యాప్ లో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు, రైస్ మిల్లుల పూర్తి సమాచారం ఉంటుందన్నారు.” కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం రైస్ మిల్లులకు చేరిన వెంటనే ఈ యాప్ ద్వారా అధికారులకు సమాచారం చేరుతుంది. వెంటనే రైతు ఖాతాలో నగదు పడేలా అధికారులు చొరవతీసుకుంటారు. ధాన్యం తరలించే వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానం చేస్తాం . వాటి కదలికలను అధికారులు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశాం . సివిల్ సప్లయ్స్ వెబ్‌సైట్‌కు కొత్త సాఫ్ట్‌వేర్ అనుసంధానం చేసినందున రైతులు తమ భూమి, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసుకుని ఒక రిజిస్ర్టేషన్ నంబర్ పొం దవచ్చు. ధాన్యం అమ్మిన ప్రతిసారి బ్యాంకు ఖాతా, వ్యవసాయ భూమి వివరాలు ఇవ్వాల్సిన అవసరముండదు” అని అన్నా రు.
కచ్చితమైన తూకం కోసం ఈ వెయింగ్ మెషీన్లు
రేషన్ డీలర్లకు కచ్చి తమైన తూకంతో నిత్యావసరసరుకులు అందించేం దుకు గోదాముల్లో ఈ-వెయింగ్మెషీన్లు అందుబాటులోకి తెచ్చామని అకున్ సబర్వా-ల్ చెప్పారు. రాష్ట్రవ్ యాప్తంగా 170 గోదాముల్లో ఈయంత్రాలను ఏర్పాటు చేశామని, వీటిని కమాండ్ కంట్రోల్ సెం టర్‌కు , జిల్లాల్ లో ని మినీ కమాండ్ కంట్రోల్ సెం టర్లకు అనుసంధానం చేశామన్నారు.