ధాన్యాన్ని తరలిస్తున్న లారీలు పట్టివేత

సూర్యాపేట, వెలుగు: అక్రమంగా ధాన్యం తరలిస్తున్న రెండు లారీలను సివిల్ సప్లయీస్​ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లికి చెందిన శ్రీ హనుమాన్ శివసాయి రైస్ మిల్ కు ఐకేపీ, పీఏసీఎస్​ సెంటర్ల ద్వారా అలాట్ చేసిన ధాన్యాన్ని   పక్కదోవ పట్టించి అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లయీస్ అధికారులు, పోలీసుల సహాయంతో గరిడేపల్లి శివారులో ఆ లారీలను పట్టుకొని సీజ్ చేసినట్టు సమాచారం.

ఈ విషయమై సివిల్ సప్లయీస్ ​డీటీ నాగలక్ష్మిని వివరణ కోరగా  ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో  రెండు లారీలను పట్టుకున్నామన్నారు. సోమవారం టెక్నికల్ టీంతో వాటి శాంపిల్స్ సేకరించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.