సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పారా బాయిల్డ్ రైస్ మిల్లుల్లో సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. సుగ్లాంపల్లి శివారు లక్ష్మీ ఇండస్ట్రీస్, సుల్తానాబాద్ పట్టణంలోని సాయి తేజ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు జరిపారు. కొనుగోలు సెంటర్ల నుంచి మిల్లులకు దిగుమతి అయిన వడ్లు, మిల్లర్లు అప్పగించిన సీఎంఆర్, ప్రస్తుతం ఉన్న నిల్వలను తనిఖీలు చేశారు.
కాగా లక్ష్మీ ఇండస్ట్రీస్‌లో 5,385 క్వింటాళ్ల వడ్లు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్డీ ప్రభాకర్ రావు, డిప్యూటీ కలెక్టర్ ఉమారాణి, డీఎం గోపాల్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మానకొండూరు, వెలుగు: కరీంనగర్ జిల్లా మానకొండూర్, తిమ్మాపూర్ మండలాల్లోని రైస్ మిల్లులో సివిల్ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. మానకొండూరు మండలం ముంజంపల్లి శివారులోని వీరభద్ర రైస్ మిల్లు, తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులోని ఆర్‌కే ఇండస్ట్రీస్‌లో తనిఖీలు చేసి భారీ తేడాలు గుర్తించినట్లు తెలిసింది. తనిఖీల్లో జగిత్యాల డీఎస్‌వో వెంకటేశ్(జగిత్యాల), ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఎస్సైలు పరంజ్యోతి, అనిల్‌కుమార్, డీఎం ఆలేరాం, మానకొండూరు సీఐ రాజ్‌కుమార్, డీటీ రాకేశ్ పాల్గొన్నారు.