రంగారెడ్డి జిల్లా : అక్రమంగా బయోడీజిల్ తయారు చేస్తున్న ముఠాను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవేపై శనివారం రాత్రి రెండు ట్యాంకర్లలో డీజిల్ తరలిస్తుండగా విశ్వాసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం విస్తృత తనిఖీలు చేయగా నందిగామ బైపాస్ కు దగ్గర్లో ఓ గోదాంలో అనుమతులు లేకుండా గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి కెమికల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేస్తున్నారు.
ALSO READ | తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ.. 30 తులాల బంగారం, కేజీ వెండి అపహరణ
అక్రమంగా వివిధ బంకులకు, పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ కు చెందిన JS ఫ్యూయిల్ బంక్ లో తనిఖీలు చేశారు. JS ఫుయల్స్ ఓనర్, అక్రమంగా బయో డీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే కావడం గమనార్హం. నిల్వ ఉంచిన గోదాంను సీజ్ చేసి .. 12వేల లీటర్లతో ఉన్న రెండు డీజిల్ టాంకర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. పోలీసులు ఇంకా ఈ దందాలో ఎవరెవరు ఉన్నారని విచారణ చేస్తున్నారు.