
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఒక సీఆర్పీఎఫ్ బంకర్ సహా వేర్వేరు ప్రాంతాల్లో వరుసగా దాడులకు తెగబడ్డారు. వరుసగా జరిగి మూడు టెర్రిరిస్టుల దాడుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరోకరికి గాయాలయ్యాయి. ఇందులో రెండు ఘటనలు శ్రీనగర్‌లోనే జరిగాయి. మరో ఘటన అనంతనాగ్‌లో జరిగింది. సీఆర్పీఎఫ్ బంకర్‌పై టెర్రరిస్టులు గ్రెనెడ్ విసిరారు. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. మొదటి దాడి శనివారం సాయంత్రం శ్రీనగర్ లోని కర నగర్ లో మజీద్ అహ్మద్ గోజ్రిపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మజీద్ తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ కు తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. తర్వాత రాత్రి 8 గంటల టైంలో బట్మాలు ఏరియాలో కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి.