సివిల్స్ 2021 ఫలితాలు విడుదల

  • సివిల్స్ టాపర్గా శ్రుతి శర్మ
  • సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 

న్యూఢిల్లీ: సివిల్స్ 2021 ఫలితాలను యూపీఎస్సీ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. శృతి శర్మ అల్ ఇండియా  నెంబర్1 ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకం కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2021 తుది ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. 
సాధించిన  ర్యాంకును బట్టి ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ - 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

సివిల్స్ కు ఎంపికైన వారిలో 277 జనరల్ కేటగిరి కాగా, ఆర్థికంగా వెనుకబడిన కేటగిరికి చెందినవారు 73, ఓబీసీ అభ్యర్థులు 203, ఎస్సీలు 105 మంది, ఎస్టీ అభ్యర్థులు  60 మంది ఉన్నారు. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంక్ సాధించగా.. పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, కె.కిరణ్మయి 56వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంకులు సాధించారు. 

 

ఇవి కూడా చదవండి

సాయం కోసం సోనూ తలుపు తట్టిన జనం

HDFC అకౌంట్స్‌‌లో కోట్లాది రూపాయలు

పుణె డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్