హైదరాబాద్​లో ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్

హైదరాబాద్​లో ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్
  • 99 సెంటర్లలో పరీక్ష నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మెహదీపట్నం సంతోష్​నగర్​లోని సెయింట్ ఆన్స్ మహిళా పీజీ కాలేజ్​లోని ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్​ను ఆయన పరిశీలించారు. గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 99 కేంద్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. 

ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన పేపర్ 1 ఎగ్జామ్​కు 25,875 మంది హాజరుకాగా, 19,278 మంది గైర్హజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించిన పేపర్ 2 ఎగ్జామ్​కు 25,661 మంది అభ్యర్థులు అటెండ్ కాగా, 19,492 మంది గైర్హాజరయ్యారు. హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించినట్టు కలెక్టర్ అనుదీప్ తెలిపారు.