హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ క్రికెట్ మ్యాచ్ లో సీజే ఎలెవన్‌దే విజయం

హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ క్రికెట్ మ్యాచ్ లో సీజే ఎలెవన్‌దే విజయం

హైదరాబాద్: హైదరాబాద్  ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషల్‌  క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ (ప్రెసిడెంట్‌  ఎలెవన్‌) జట్టుపై న్యాయమూర్తుల (ప్రధాన న్యాయమూర్తి ఎలెవన్‌) జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీజే ఎలెవన్‌  నిర్ణీత 16 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ప్రెసిడెంట్‌  ఎలెవన్‌  జట్టు 74 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 

జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్‌ మధుసూదన్‌రావు బౌలింగ్, బ్యాటింగ్‌లో ప్రతిభ కనబరిచారు. జస్టిస్‌  సురేందర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌  బహుమతి అందుకున్నారు. యాక్టింగ్  చీఫ్  జస్టిస్‌  సుజోయ్‌పాల్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. జస్టిస్‌  కె.లక్ష్మణ్, జస్టిస్‌  మాధవిదేవి, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్, జస్టిస్‌  సీవీ భాస్కర్‌ రెడ్డి, జస్టిస్‌ శ్రీనివాస్‌ రావు, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శులు శాంతిభూషణ్, సంజీవ్‌ రెడ్డి, అదనపు కార్యదర్శి నవీన్‌  పాల్గొన్నారు.