న్యూఢిల్లీ: ఓ లాయర్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన అధికారాల జోలికి రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఓ న్యాయవాది వాదిస్తున్న కేసుకు సంబంధించిన పిటిషన్ ఏప్రిల్ 17న సీజేఐ బెంచ్ ఎదుట విచారణకు రానుంది. అయితే, దీనిపై 14వ తేదీనే ముందస్తు విచారణ జరపాలని సదరు లాయర్ మంగళవారం ఉదయం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌ను కోరారు.
అలా కుదరదని సీజేఐ తేల్చిచెప్పడంతో.. దీనిపై సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం ఎదుట అప్పీల్ చేసుకోవడానికి అనుమతివ్వాలని లాయర్ అడిగారు. దీనిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ లాయర్ క్షమాపణలు కోరారు. ‘‘ మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాం. 17వ తేదీ అంటే 17వతేదీనే పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. నా అధికారాలను సవాల్ చేసేందుకు ప్రయత్నించకండి”అని
సీజేఐ చంద్రచూడ్ చెప్పారు.