జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత.. సీజేఐగా సంజీవ్ ఖన్నా

జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత.. సీజేఐగా సంజీవ్ ఖన్నా

సుప్రీంకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖానన్నాను తన వారసుడిగా ప్రకటించారు సీజేఐ డీవై చంద్రచూడ్. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు.ప్రభుత్వ ఆమోదం తర్వాత సుప్రీంకోర్టు 51 వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తారు. 2024 నవంబర్ 10న డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.

ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 

జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. జిల్లాకోర్టుల్లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన జస్జిస్ సంజీవ్ ఖన్నా తర్వాత కాలంలో ఢిల్లీ హైకోర్టు, ట్రిబ్యునల్స్ వెళ్లారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా , అమికస్ క్యూరిగా ఢిల్లీ హైకోర్టులో అనేక క్రిమినల్ కేసులు చేపట్టారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఏ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి కాకముందే సుప్రీంకోర్టుకు పదోన్నతి పొంది కొద్దిమందిలో జస్టిస్ ఖన్నా ఒకరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖాన్న అనేక ముఖ్యమైన తీర్పుల్లో భాగమయ్యారు. 

ఆర్టికల్ 370 రద్దు, 2018 ఎలక్టోరల్ బాండ్ల పథకం వంటి కేసుల్లో రాజ్యాంగ బెంచ్ తీర్పులలో జస్టిస్ సంజీవ్ ఖన్నా భాగమయ్యారు. సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ లో ఖన్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.