ఢిల్లీలో పొల్యూషన్ వల్ల మార్నింగ్‌‌‌‌ వాక్‌‌‌‌ మానేశా : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌‌‌

ఢిల్లీలో పొల్యూషన్ వల్ల మార్నింగ్‌‌‌‌ వాక్‌‌‌‌ మానేశా : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌‌‌

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కలిగిస్తున్నదని, గాలిలో నాణ్యత తగ్గిపోతుండడంతో మార్నింగ్​ వాక్​ మానేశానని సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డీవై చంద్రచూడ్‌‌‌‌ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్​ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ఈ రోజు నుంచి నేను మార్నింగ్‌‌‌‌ వాక్‌‌‌‌కు వెళ్లడం లేదు. సాధారణంగా రోజూ ఉదయం 4 గంటలకు వాకింగ్‌‌‌‌కు వెళ్తా. కానీ ప్రస్తుతం బయట గాలి నాణ్యత బాగా పడిపోయింది. 

ఉదయం బయటకు వెళ్లకపోవడమే మంచిదని డాక్టర్​ సలహా ఇచ్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న’’ అని సీజేఐ పేర్కొన్నారు. కాగా,  ఢిల్లీలో పొగమంచు కారణంగా రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత (ఏక్యూఐ) 283గా నమోదైంది.