న్యాయసేవల వికేంద్రీకరణకు తెలంగాణ ముందడుగు వేయడం దేశ న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. 32 జిల్లాల కోర్టులను సీఎం కేసీఆర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో 32 జిల్లాల న్యాయవ్యవస్థ లను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీజేఐ తెలిపారు. వికేంద్రీకరణ ఫలితాలు రావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి లో లక్షా 82వేల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సీజేఐ వెల్లడించారు.
ఇక రాష్ట్ర ప్రజలకు సీజేఐ ఎన్వీరమణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 8 ఏళ్ల క్రితం అనేక ఉద్యమాలు చేసి రాష్టాన్ని సాధించారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ కూడా ముఖ్యమని సీఎం కేసీఆర్ భావించినట్లు సీజేఐ చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చెరువ కావాలనేది తన కోరికన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలకోసం పని చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి..న్యాయ వ్యవస్థపై విస్తృతంగా ప్రచారం చేసినట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన ప్రధానమంత్రి, న్యాయమూర్తుల సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బంది నియామకాల పై చర్చించినట్లు సీజేఐ వెల్లడించారు. రాష్ట్రంలో న్యాయమూర్తుల సంఖ్య 24 నుండి 44 పెంచాలని తీర్మానించి అమల్లోకి తెచ్చామన్నారు. మరో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను త్వరలో నియమిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరం ఐటి రంగంలో దూసుకెళ్తుందని.. న్యాయ వ్యవస్థ కూడా ఐటీ రంగాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
అన్ని రాష్టాలు తెలంగాణలాగా వికేంద్రీకరణ చేయాలని సీజేఐ ఎన్వీరమణ సూచించారు. వాణిజ్య వివాదాలు పెరిగే అవకాశం ఉన్నందున..కమర్షియల్ కోర్టుల సంఖ్య పెంచాలన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వెయ్యడం ఎక్కువైందన్న సీజేఐ..ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలి అంటే న్యాయ వ్యవస్థ బలంగా పనిచేయాలన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించడం దేశం లో ఉన్న ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
మరిన్ని వార్తల కోసం
ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు
పల్లెప్రగతి సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు