
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్ఆర్ఐ కోటా సీట్లున్న కాలేజీలపై స్పష్టత వచ్చింది. 2024–25 విద్యాసంవత్సరంలో 32 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. దీంట్లో 8 కాలేజీలకు గల్ఫ్ కోటా, పీఐఓ కోటా కింద సీట్లు భర్తీ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. దీంట్లో 11 ఓయూ పరిధిలో ఉండగా, 21 కాలేజీలు జేఎన్టీయూ పరిధిలో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ఇవే కాలేజీల్లో ఈ కోటా సీట్లు అమలు చేసుకునే అవకాశం ఉంది.