హైదరాబాద్: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీజేపీ నేత బంగారు శృతి స్పందించారు. పార్టీ మారబోయేది లేదని క్లారిటీ ఇచ్చారు. ‘ బీజేపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు. నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో ఎవరు ఉన్నా వారి గెలుపునకు కృషి చేస్త. త్వరలో మీ ముందుకు వస్త’అని ట్విట్టర్లో వీడియో పోస్ట్పెట్టారు. కాగా నిన్న ఆమె సీఎం రేవంత్ ను కలవడంతో పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.