మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!

మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్ అకౌంట్ ఉందా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎస్‎బీఐ సేవింగ్ అకౌంట్ల నుండి ఉన్నట్టుండి డబ్బులు కట్ అవుతున్నాయి. దీంతో అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు డిడెక్ట్ అవుతున్నాయో తెలియక ఖాతాదారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. సేవింగ్ ఖాతాల నుండి డబ్బు కట్ అవ్వడానికి గల కారణాన్ని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. 

అదేంటో చూద్దాం.. 50 కోట్ల మంది కస్టమర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్‎బీఐ తమ వినియోదారులకు అనేక రకాల డెబిట్ కార్డ్‌ (ఏటీఎం)లను అందిస్తోంది. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ లేదా కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు అని ఇలా రకరకాలు కార్డులు జారీ చేస్తోంది ఎస్‎బీఐ. అయితే.. తమ కార్డు దారులకు మెరుగైన సేవలు అందించేందుకు కార్డ్ ఇయర్ మెయింటెన్స్ ఛార్జ్ వసూల్ చేస్తోంది ఎస్బీఐ. 

ఏటీఎం కార్డు రకాన్ని బట్టి   బ్యాంక్ వార్షిక నిర్వహణ రుసుము వసూల్ చేస్తోంది. మినిమం రూ.200 నుండి ఆ పైన కార్డు యాన్యువల్ ఛార్జ్ చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం.  బ్యాంకు నిర్వహించే లావాదేవీలపై 18% జీఎస్టీ. అంటే.. ఒక కార్డుకు యాన్యువల్ మెయింటెన్స్ ఛార్జ్ కింద బ్యాంక్ రూ.200 కట్ చేస్తే దానికి జీఎస్టీ కలుపుకుని మన అకౌంట్ నుంచి రూ.236  కట్ చేస్తోంది ఎస్బీఐ. 

ALSO READ | ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మస్తు డిమాండ్.. 3గంటల్లో రూ. 52వేల కోట్లు ట్రేడింగ్

క్లాసిక్/సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ కలిగి ఉన్న కస్టమర్‌లకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ రూ. 236. అదే.. గోల్డ్ / కాంబో / మై కార్డ్ (ఇమేజ్) వంటి ఏటీఎం కార్డులకు రూ. 250+జీఎస్టీ. అలాగే.. ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డ్‌కు రూ. 325+జీఎస్టీ.  ప్రైడ్/ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌లకు యాన్యువల్ ఛార్జ్ రూ. 350+జీఎస్టీ విధిస్తోంది ఎస్బీఐ.

ప్రతి ఏడాది ఈ డబ్బులు మన అకౌంట్ నుంచి బ్యాంక్ కట్ చేస్తోంది. ఈ విషయం తెలియక ఖాతాదారులు కొందరు గందరగోళానికి గురి అవుతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్, లేదా బ్యాంక్ నుంచి రిజస్డర్డ్ మొబెల్ నెంబర్లకు వచ్చే మేసేజ్‎లను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతోంది.  ఇవే కాకుండా ఇంకా ఎక్కువగా డబ్బులు కట్ అయితే.. నేరుగా బ్యాంక్‎కు వెళ్లి అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు.