
జగిత్యాల జిల్లాలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోరుట్ల నంది చౌరస్తా వద్ద ఉన్న వైన్ షాపులో మద్యం సేవించిన వ్యక్తులు కొట్టుకున్నారు. వైన్‌షాపు పర్మిట్ రూం నుంచి మద్యం మత్తులో బయటకు వచ్చిన కొందరు అక్కడ ఉన్న ఓ వర్గంపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా కొట్టారు. కొట్టుకున్న వారిలో మహిళలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మందుబాబులను చెదరగొట్టారు. గొడవకు పాతకక్ష్యలే కారణమని సమాచారం అందుతోంది.