జేపీ దర్గా వద్ద ఘర్షణ.. నలుగురు భక్తులు, వ్యాపారులకు మధ్య కొట్లాట

జేపీ దర్గా వద్ద ఘర్షణ.. నలుగురు భక్తులు, వ్యాపారులకు మధ్య కొట్లాట

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం ఇన్ముల్‌‌‌‌నర్వ గ్రామ సమీపంలోని హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా వద్ద నలుగురు భక్తులు, స్థానిక వ్యాపారులకు మధ్య కొట్లాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. 

స్థానికుల వివరాల ప్రకారం.. వాహనాలపై బాబా దర్శనం కోసం వచ్చే భక్తులను స్థానిక వ్యాపారులు తమ దుకాణం వద్ద ఆపుతుంటారు. తమ వద్ద పూజా సామగ్రి కొంటే బండిని ఫ్రీగా పార్కింగ్​చేసుకోవచ్చని చెబుతుంటారు. అందులో భాగంగానే సోమవారం ఉదయం రెండు బైక్​లపై వచ్చిన నలుగురు భక్తులను స్థానిక వ్యాపారులు ఆపారు. 

ఏమైందో తెలియదు కానీ ఇరువురి మధ్య తోపులాట మొదలై  కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో స్థానికులు కలగజేసుకొని గొడవ సద్దుమణిగించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.