భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఇరు వర్గాల మధ్య భూవివాదం కారణంగా ఇంటిపై దాడి చేశారు ప్రత్యర్థులు..కుటుంబ సభ్యులపై దాడి చేసి ఓ మహిళ బట్టలు విప్పేసారు.
ములకలపల్లి మండలం రాజాపురం గ్రామంలో భూవివాదం కారణంగా ఊకే రాజేంద్ర ప్రసాద్, భార్య లక్ష్మి, కుమారుడు బాబురావులపై ప్రత్యర్థి వర్గం దాదాపు 70 మంది ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో తల్లి కొడుకు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వస్తువులను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులను.. కొంత నగదును ఎత్తుకుపోయారని బాధితులు తెలిపారు. మహిళ బట్టలు చించేశారని బాధితులు ఆరోపిస్తూ.. ములకలపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.