మునుగోడు బైపోల్ : చండూరులో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

మునుగోడు నియోజకవర్గం చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. నాన్ లోకల్ లీడర్స్ ను పోలీసులకు పట్టించినా..వదిలేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఘటనాస్థలానికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుకుని ఆరా తీశారు. 

మద్యం పట్టుకున్న బీజేపీ నేతలు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్కు సమయం ఉన్నా.. ఇంకా ఓటర్ల ప్రలోభాలు కొనసాగుతున్నాయి.. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో బీజేపీ నేతలు మద్యం పట్టుకున్నారు. ఈ గ్రామానికి టీఆర్ఎస్ ఇంచార్జ్గా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు మద్యం, పైసలు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.