బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు

సిద్దిపేటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యక్తలు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. మోదీ జిందాబాద్, హరీష్ రావు జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యక్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు కార్యక్తలకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. 

ALSO READ: పథకాలు అడిగితే మహిళను బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అక్టోబర్ 3వ తేదీన సిద్దిపేట, సికింద్రాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించారు.