
నల్లగొండ మున్సిపాలిటీలోని ఆర్జాల బావిలో ఉద్రిక్తత ఏర్పడింది. తమ పార్టీ కార్యకర్తపై బీఆర్ఎస్ వాళ్లు దాడిచేశారని ఆందోళనకు దిగారు కాంగ్రెస్ వర్గీయులు. మరోవైపు తమ పార్టీ కార్యకర్త అన్వర్ పై కాంగ్రెస్ వాళ్లు దాడి చేశారని బీఆర్ఎస్ వర్గీయులు కౌన్సిలర్ అశ్విని భాస్కర్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈమధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు అశ్విన్. ఘర్షణలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి వెళ్లి ఓదార్చారు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో టెన్షన్ ఏర్పడింది.