బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

కామేపల్లి, వెలుగు : మండలంలోని పండితాపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. ఇరువర్గాల్లోని సభ్యులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు తారసపడ్డారు. వారి మధ్య తొలుత చిన్నగా మొదలైన గొడవ చివరికి కొట్టుకునేంతవరకు వెళ్లింది. ఈ దాడిలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన బండి ఉపేందర్, బండి నాగరాజు, బొమ్మగాని పిచ్చయ్య, జమాలి రాకేశ్,  బుడిగే సీతకు తీవ్ర గాయాలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చల్లా లాలయ్య, చల్లా హరి, చల్లా సులోమన్, చల్లా అప్పారావు కూడా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.