- బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
చెన్నూర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు చెన్నూరులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రోడ్డు పై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. బీఆర్‌ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్థానిక సీఐ బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.