మైలారం మారమ్మ బోనాలలో ఉద్రిక్తత

మైలారం మారమ్మ బోనాలలో ఉద్రిక్తత
  • ​​​​​కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ

రాయపర్తి, వెలుగు:  వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో మారమ్మ బోనాల సందర్భంగా గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బోనాలతో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరిపాటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు వచ్చారు. అదే దారిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడ్డారు.  దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య గొడవ జరిగింది.  ఆలయం వద్ద  పూజల అనంతరం ఎమ్మెల్యే వెళ్లాక తీవ్ర స్థాయిలో మరోసారి ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు.