ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కామేపల్లి మండలం పండితాపురంల గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ప్రభ ఊరేగింపులో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్త గొడ్డలితో దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమంతరావు కారు ధ్వంసం అయ్యింది.
నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను ఆపే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ తొమ్మిది మందిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.