ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామంలో రిపబ్లిక్ డే వేడుకల్లో కాంగ్రెస్ ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాత కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. జెండా ఆవిష్కరించే సమయంలో ఇరువర్గాలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. జెండా ఆవిష్కరించడానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నారు.
ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉన్న గ్రామస్థులు వారిని విడదీసే ప్రయత్నం చేశారు. కానీ ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డారు. ఏది ఏమైనా కానీ ముందు ముందు ఈ వర్గాలు వల్ల పార్టీ నిలబడుతుందో లేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.