బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు

బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు

బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు రేగింది. నచ్చని అభ్యర్థిని బరిలో నిలిపారంటూ నేతలు అలకబూనినట్లు తెలుస్తోంది. పల్లావర్గానికి చెందిన ఏనుగు రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మెజారిటీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ముఖ్యనేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 130 మందికి ఆహ్వానం పంపితే..కేవలం 50 మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు సైతం సమావేశానికి గైర్హాజరయ్యారు.  రాకేశ్ అభ్యర్థిత్వాన్నివరంగల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో సహ పలువురు మాజీ ఎమ్మెల్యేలు డమ్మా కొట్టారు.  కేటీఆర్ ఒత్తిడితో వినయ్ భాస్కర్ సమావేశానికి హాజరయ్యారు.  పల్లాకు అనుచరుడిగా రాకేష్ రెడ్డికి పేరుంది. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది నిలిచారు. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలుకాగా.. 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4లక్షల 61వేల 806 మంది ఓటర్లు ఉన్నారు.  తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ మద్దతిస్తుండగా....బీజేపీ.. ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతిస్తుంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టాయి.