వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రసభాసగా మారింది. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు, పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందు కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎంత చెప్పిన వినకపోవడంతో కార్యాలయం నుంచి కడియం కావ్య వెళ్లిపోయారు.