
అమెరికా వేదికగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు యుద్దానికి దిగారు. రెండు వర్గాలుగా చీలిపోయి పిడి గుద్దులు కురిపించుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరగటం గమనార్హం. జూ.ఎన్‌టీఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడంతోనే రెండుగా చీలిపోయి కొట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
జూ.ఎన్‌టీఆర్ పేరు ప్రస్తావించినందుకే గొడవ..!
సభలో జూ.ఎన్‌టీఆర్ అభిమానులు కొందరు అతని పేరును ప్రస్తావనకు తీసుకురావడంతోనే ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఇది నచ్చని టీడీపీ మద్దతుదారులు.. జూ.ఎన్‌టీఆర్ అభిమానులపై దాడికి దిగారని సమాచారం. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు రెండుగా చీలిపోయి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరగ్గా.. ఆయన విడదీసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2023
చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు
టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే కొట్లాట#TANA pic.twitter.com/lyGozFmZ1c