సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.దసరా వేడుకల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. రామాలయం దగ్గర జమ్మిచెట్టు పూజ జరుగుతుండగానే గొడవకు దిగారు. కుర్చీలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.