రెండు వర్గాల మధ్య ఘర్షణ.. సూర్యాపేటలో ఉద్రిక్తత

రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో సూర్యాపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హూజూర్ నగర్ లోని ఓ సమూహంపై ఏపీ నుంచి వచ్చిన పలువురు దాడికి పాల్పడ్డారు. 

గమనించిన స్థానికులు ప్రత్యర్థులపై దాడి చేశారు. చినికి చినికి గాలి వానలా మారిన ఈ ఘర్షణలో గొడ్డళ్లు, కర్రలు ఆయుధాలుగా మారాయి. ఈ దాడుల్లో ఒకరికి తీవ్ర గాయాలుకాగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.