- నల్గొండలో పార్టీ ఆఫీసును కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్నాయకులు
- రూల్స్ కు విరుద్ధంగా ఉందంటున్న కాంగ్రెస్
- డీటీసీపీ రిపోర్ట్మేరకు ఆఫీసు కూల్చడం అనివార్యం
- ఈనెల 11 వరకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి కోమటిరెడ్డి
- అంతిమ నిర్ణయం డిస్మెంటల్ టాస్క్‌ఫోర్స్ కమిటీదే
నల్గొండ, వెలుగు : నల్గొండ నడిబొడ్డున్న బీఆర్ఎస్ నిర్మించిన జిల్లా పార్టీ ఆఫీసుపై రాజకీయ దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పార్టీ ఆఫీసును కూల్చివేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబడుతుండగా, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఆఫీసును కూల్చకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అప్పటి నేతలు డీటీసీపీ (డైరెక్టరేట్ఆఫ్ టౌన్ అండ్‌కంట్రీ ప్లానింగ్)
అనుమతులు పొందకుండానే లక్షలు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో పార్టీ ఆఫీసు నిర్మించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో నిబంధనలు అతిక్రమించి వంద కోట్లు ఖరీదు చేసే ప్రభుత్వ స్థలంలో రెండు భవనాలు కట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్అధికారంలో రాగానే బీఆర్ఎస్ఆఫీసును కూల్చివేస్తామని, ఆ ప్లేస్‌లో సర్కారు ఆఫీసులు కడ్తామని చాలెంజ్‌చేశారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్‌పై గుర్రు...
నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వైఖరి వల్లే పార్టీ ఆఫీసు వివాదంలో చిక్కుకుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ఆఫీసుకు ధీటుగా నల్గొండ ఆఫీసు ఉండాలని భావించి తన సొంత డబ్బులు కోటి రూపాయలు వరకు ఖర్చు పెట్టారు. పార్టీ ఫండ్మరో రూ.90 లక్షలు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో అన్ని ఆఫీసులు ఎప్పుడో కడితే, నల్గొండలో మాత్రం రెండేళ్లు దాటింది. .
వాస్తుపై నమ్మకంతో భూపాల్‌రెడ్డి డైరెక్షన్లోనే బిల్డింగ్ప్లానింగ్, డిజైన్‌చేశారు. ఎలాంటి వాస్తుదోషాలు ఉండొద్దనే ప్రభుత్వ స్థలంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల స్థలాన్ని కూడా బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
ఇంకా ప్రారంభం కూడా చేయలే..
ఇంత కష్టపడ్డా అధికారం కోల్పోయేవరకు కూడా పార్టీ ఆఫీసును అధికారికంగా ఓపెన్చేయకపోవడం గమనార్హం. మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్‌కాలేజీ, పార్టీ ఆఫీసు ఓపెన్చేయించాలని మాజీ ఎ మ్మెల్యే భావించారు. కానీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు నియామకం జరిగే వరకు కూడా ఆఫీసు నిర్మాణం, మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తికాలేదు. ఇన్నాళ్లు అనధికారికంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్సర్కారు పార్టీ ఆఫీసు కూల్చివేతకు సిద్ధమవడంతో దాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
డీటీసీపీ రిజక్ట్ చేసింది..
ఆగ్రోస్‌కు చెందిన రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీసీఎల్ఏ నుంచి కేవలం రూ.3.50 లక్షలకే పార్టీ ఆఫీసుకు కట్టబెట్టింది. నల్గొండ- –హైదరాబాద్రోడ్డును ఆనుకుని ఉన్న ఈ స్థలం విలువ వంద కో ట్లు. కాగా, అప్పనంగా రూ.3.50 లక్షలకే పార్టీ ఆఫీసుకు కట్టబెట్టారు. ఇంత కష్టపడ్డ అప్పటి లీడర్లు డీటీసీపీ అప్రూవల్తీసుకోలేదు. పైగా అప్పటి మున్సిపల్‌పాలక మండలి బీఆర్ఎస్ చేతిలోనే ఉన్న తీర్మానం ఆమోదిం చుకోలేకపోయింది. దీన్నే అదునుగా భావించిన మంత్రి కోమటిరెడ్డి అనుమతులు లేకుండా కట్టిన పార్టీ ఆఫీసును ఈనెల 11లోగా కూల్చేయాలని డెడ్లైన్పెట్టారు.
అమెరికా పర్యటన ముగించుకుని వచ్చేలోగా పార్టీ ఆఫీసు కనిపించొద్దని హుకుం జారీ చేశారు. దీంతో కంగుతిన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్అధిష్టానం సూచన మేరకు ఆగమేఘాల మీద డీటీసీపీకి పెట్టిన దరఖాస్తు సైతం రిజక్ట్ అయ్యింది. ని బంధనలకు విరుద్ధంగా ఆఫీసు కట్టారని, సరైన సెట్బాక్స్లేవని రిపోర్ట్ ఇచ్చింది. దీంతో వెంటనే బిల్డింగ్ కూల్చివేయాలని గత నెల 22న నల్గొండ మున్సిపల్కమిషనర్జిల్లా డిస్మెంటల్ టాస్క్ఫోర్స్కమిటీకి రిపోర్ట్ పంపారు. కమిటీకి ఇచ్చిన 15 రోజుల గడువు సోమవారంతో పూర్తియింది.
దీంతో గడువు ముగిసినా అధికారులు కూల్చివేతపై వెనకడుగు వేయడంతో మంత్రి కోమటిరెడ్డి అధికారులపై సీరియస్అయ్యారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు డిస్మెంటల్టాస్క్ఫోర్స్కమిటీ నియమాకం జరుగుతుంది. దీంట్లో పోలీస్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే పార్టీ ఆఫీసు కూల్చేస్తారని కమిషనర్చెప్పారు. నిర్మాణంలో ఉన్నవాటి పైనే వచ్చే అభ్యంతరాలపైనే కమిషనర్‌కు పవర్స్ఉంటాయి. ఆల్రెడీ నిర్మించిన భవనాలు, లేదా పార్టీ ఆఫీసులపై చర్యలు తీసుకునే అధికారం డిస్మెంటల్ టాస్క్‌ఫోర్స్ కమిటీకి మాత్రమే ఉంటుందని మున్సిపల్అధికారులు తెలిపారు.
టీఎస్బిపాస్కు అప్లై చేసినం
మున్సిపల్యాక్ట్146 సెక్షన్ ప్రకారం టీఎస్బీపాస్కు అప్లై చేసినం. నిబంధనలకు విరుద్ధంగా ఆఫీసు కడితే దానికి ఎంత పెనాల్టీ చెల్లించాలో చెబితే అంత కడ్తామని కలెక్టర్, స్టేట్కమిషనర్కు లెటర్ పెట్టినం. స్థలాన్ని సీసీఎల్ఏ రూల్స్ ప్రకారం కొన్నాం. ఆఫీసు నిర్మాణంలోనే పర్మిషన్తీసుకోలేదు. టీఎస్‌బీపాస్ లో పెనాల్టీ చెల్లిస్తాం. లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం.
-రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు