నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు PACS సర్వసభ్య సమావేశంలో గొడవ జరిగింది. సభకు హాజరైన రైతులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గ సభ్యుల మధ్య తోపులాట జరిగింది.
Also Read : సోషల్ మీడియా యూజర్లకూ ఏజ్ లిమిట్ నిర్ణయించండి: కర్నాటక హైకోర్టు
ఒకరిపై ఒకరు కుర్చీలు, టేబుళ్లు విసురుకున్నారు. సొసైటీలో లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని ప్రశ్నించారు రైతులు, డైరెక్టర్లు. అడగడానికి మీరెవరంటూ ఫైర్ అయ్యారు PACS చైర్మన్. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రైతుల సమస్యలను చర్చించకుండానే సమావేశం వాయిదా వేశారు అధికారులు.