మద్యం మత్తులో యువకుల ఘర్షణ.. ఒకరు మృతి

కరీంనగర్ పట్టణంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బండ రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిని ఒకరు రాళ్లతో బలంగా కొట్టుకోవడంతో అందులో ఒకరికి తీవ్ర గాయాలై.. స్పాట్ లోనే చనిపోయాడు. మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.