ఏపీలో ఎన్నికలు ఘర్షణ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు టీడీపీ పోలింగ్ ఏజెంట్లకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారి స్థానంలో మరో ఇద్దర్ని కూర్చోబెట్టారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న సమయంలో ఘర్షణ జరిగినట్టు సమాచారం.
దీంతో రెంటాల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. అటు కడప జిల్లాలోని కమలాపురం మండలం కోగట్టంలోనూ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికల వాతావరణం చెడగొట్టందంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ప్రాశాంతంగా పూర్తయ్యేల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు.