పాపం ఈ 8 ఏళ్ల పాప.. చూస్తుండగానే ప్రాణం పోయింది.. కంటతడి పెట్టిస్తున్న వీడియో..

అహ్మదాబాద్: గుజరాత్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక స్కూ్ల్లోనే కుప్పకూలి కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయింది. ఈ హృదయ విదారక ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న జెబర్ స్కూ్ల్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గార్గి అనే 8 ఏళ్ల బాలిక జెబర్ స్కూ్ల్లో 3rd క్లాస్ చదువుతోంది. రోజూలానే శుక్రవారం కూడా ఆటోలో స్కూల్కు వెళ్లింది. 

క్లాస్ రూంలోకి వెళ్లే లోపు ఆ పాపకు చెస్ట్ పెయిన్ అనిపించింది. అటూఇటూ చూస్తూ ఒక దగ్గరే కాసేపు నిల్చుని ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్లి చైర్ ఒకటి ఉంటే ఆ కుర్చీలో కూర్చుంది. కుర్చీలో కూర్చున్న సెకన్ల వ్యవధిలోనే ఆ పాప కుప్పకూలిపడిపోయింది. స్పృహ కోల్పోయిందని అంతా అనుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాళ్లు పాపను గమనించి సీపీఆర్ చేశారు.

సీపీఆర్ చేసిన తర్వాత కూడా పాపను ఎలాంటి చలనం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ పాప కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయి ఉండొచ్చని ప్రిలిమినరీ రిపోర్ట్స్లో వైద్యులు తెలిపారు. పాపకు చెస్ట్ పెయిన్ రావడం, ఇబ్బంది పడటం, ఆ తర్వాత కుర్చీలో కూర్చోవడం, కాసేపటికే కుప్పకూలి కిందపడిపోవడం.. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం గమనార్హం. ఆ వీడియో చూసిన నెటిజన్లకే గుండె బరువెక్కిందంటే.. ఇక ఆ పాప తల్లిదండ్రులు పడే బాధను మాటల్లో చెప్పలేం.

Also Read :- రిజర్వాయర్ లో మునిగి.. ఐదుగురు మృతి

‘హార్ట్​ఎటాక్​ పెద్దవాళ్లకే వస్తుంది’ అనుకునే రోజులు పోయాయి.  ఇప్పుడు చిన్నారులు కూడా హార్ట్​ఎటాక్ బారిన పడుతున్నారు. హార్ట్ఎటాక్​ వచ్చినప్పుడు గుండె లయలో మార్పులు వస్తాయి. హార్ట్ఎటాక్​ వచ్చినా కూడా గుండె కొట్టుకునే వేగంలో తేడా లేనంతవరకు తట్టుకోగలరు. ప్రాణాపాయం ఉండదు. కానీ, హార్ట్​బీట్​ మారితే వయసులో చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా తట్టుకోలేరు. ఛాతి మధ్యలో నొప్పి వస్తుంది. ఛాతి మీద బరువు పడ్డట్టు ఉంటుంది. అంతేకాకుండా ఛాతిని దగ్గరికి లాగినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు చిన్నగా మొదలై, అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాయి. కొందరిలో మాత్రం లక్షణాలు కనిపించిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయి గుండె కొట్టుకోవడం ఆగిపోయి ప్రాణం పోతోంది.