
కర్నాటకలోని రాయచూర్‌లోని ఓ ఆశ్రమంలో పెన్ను దొంగిలించాడనే నెపంతో 3వ తరగతి విద్యార్థిని చిత్రహింసలకు గురిచేశారు. మూడు రోజుల పాటు గదిలో బంధించి, కర్రలతో కొట్టారని బాలుడి కుటుంబసభ్యులు చెప్తున్నారు. రాయచూరులోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్న తరుణ్‌కుమార్ అనే పిల్లాడు పెన్ను దొంగలించాడని ఆశ్రమం ఇన్‌చార్జి వేణుగోపాల్ విచక్షణారహితంగా బాలుడిని కొట్టాడు.
ఆశ్రమ ఇన్ఛార్జ్, అక్కడి హెల్పర్స్ కలిసి పిల్లాడికి నరకం చూపించారు. కుమార్ కళ్లు వాచిపోయాయి. ఒంటిపై గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. పెన్ను కచ్చితంగా తరుణే తీసాడని ఎవరికీ తెలియదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై తరుణ్ తల్లిదండ్రులు, బాలల హక్కుల కమిషన్ ఆశ్రమం ఇన్చార్జ్ పై కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టారు.