ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థిని రాళ్ళతో కొట్టి చంపారు

ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థిని రాళ్ళతో కొట్టి చంపారు

ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థులు గొడవపడ్డారు.. ఆ ముగ్గురు స్నేహితులే అయినప్పటికీ ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడితో ఇయర్ ఫోన్స్ విషయంలో గొడవపడ్డారు. వారి మధ్య ఘర్షణ పెరిగి స్నేహితుడిని కొట్టారు.. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.. ఏమీ తెలియనట్లు వెళ్లి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు విషయం తెలియ జేశారు. 
రంగంలోకి దిగిన పోలీసులు అనుమానం వచ్చి ఇద్దరు విద్యార్థి స్నేహితులను విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని రూర్కెలాలో రుద్రనారాయణ్ అనే విద్యార్థి ని కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు .. షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇయర్ ఫోన్స్ విషయంలో గొడవ పడి రుద్ర నారాయణ్ ను అతని స్నేహితులే చంపేశారని దర్యాప్తులో తేలింది. 

రుద్ర నారాయణ్ 9వ తరగతి విద్యార్థి.. అతని మరో స్కూళ్లో అదే క్లాస్ చదువుతున్న ఇద్దరు స్నేహితులున్నారు. ముగ్గురు కలిసి సైకిల్ పై నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు.. అక్కడి ఇయర్ ఫోన్స్ తో మ్యూజిక్ వింటుండగా.. ఇయర్ ఫోన్స్ ఇవ్వలేదన్న కోపంతో రుద్ర నారాయణకు, ఇద్దరు స్నేహితులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రుద్ర నారాయణను ఆ ఇద్దరు విద్యార్థులు( స్నేహితులు) రాళ్లతో కొట్టి పారిపోయారు. 

రెండు రోజుల తర్వాత రుద్ర నారాయణ్ తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రుద్ర నారాయణ్ కోసం పోలీసులు గాలించగా నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది.. రుద్ర నారాయణ్ తో కలిసి వెళ్లిన ఇద్దరు విద్యార్థులను విచారించగా అసలు విషయం తెలిసింది.